వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ | WhatsApp to tweak delete for everyone feature | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌

Oct 15 2018 6:33 PM | Updated on Oct 15 2018 7:06 PM

 WhatsApp to tweak delete for everyone feature - Sakshi

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్  యూజర్లకు  మరో వెసులుబాటును కల్పించింది. మెసేజ్‌లను డిలీట్‌ చేసే గడువును భారీగా పొడిగించింది. పొరపాటున  సెండ్‌ చేసిన మెసేజ్‌ను  కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా.. ఈ అంశంలోనే వినియోగదారులకు  భారీ ఊరట కల్పించనుంది. ఈ మేరకు  తాజాగా ఈ ఫీచర్‌లో మరో మార్పు తీసుకురానుంది.

గతేడాది కొత్త ఫీచర్‌ "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే ఆ  మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్‌ చేయవచ్చు.  ఇప్పటివరకు ఇలా సెండ్‌ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది.   తాజా అప్‌డేట్‌ ప్రకారం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement