వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ : ఆండ్రాయిడ్స్‌లోకి...

WhatsApp Android Users Finally Getting This iOS Exclusive Feature - Sakshi

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ తన యూజర్లకు ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ అలరిస్తూ ఉంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఐఓఎస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్‌గా ఉన్న ‘పిక్చర్‌-టూ-పిక్చర్‌ మోడ్‌’ ఫీచర్‌ను వాట్సాప్‌ ఎట్టకేలకు ఆండ్రాయిడ్‌ యూజర్లకు ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లోనే వీడియోను చూసుకునేలా ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు డబ్ల్యూఏబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. కంపెనీ మీ చాట్ అనుభవాన్ని ఎలాంటి అవాంతరం కలిగించకుండా.. వీడియో ప్లే చేసుకునేందుకు ఒక పాప్-అప్/ ఫ్లోటింగ్ విండోను జోడిస్తుంది. గూగుల్‌ ప్లే బీటా ప్రొగ్రామ్‌లో కంపెనీ ఇప్పటికే తన అప్‌డేట్‌ను సమర్పించింది. ఈ అప్‌డేట్‌లో ఆండ్రాయిడ్‌ పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది. 

యాప్‌కు ఈ ఫీచర్‌ను యాడ్‌ చేస్తే, ఆండ్రాయిడ్‌ యూజర్లు వాట్సాప్‌లో వచ్చిన వీడియో కోసం ప్లే ఐకాన్‌ను క్లిక్‌ చేసుకుని చూడొచ్చు. అదేవిధంగా చాట్‌ను కూడా నేవిగేట్‌ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలకు పనిచేయనుంది. ఇదే ఫీచర్‌ ఇప్పటికే ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. మరోవైపు ఇప్పటికే యూట్యూబ్‌ వీడియోలను యాప్‌లోనే చూసుకునేలా వాట్సాప్‌ యూజర్లకు అనుమతి ఇస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. గత రెండేళ్లుగా వాట్సాప్‌ యూజర్లు వాయిస్‌, వీడియో కాల్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. రోజుకు 200 కోట్ల నిమిషాల కాల్స్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాయిస్‌, వీడియో కాల్స్‌కు మరింత డిమాండ్‌ను పెంచేందుకు గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు వాట్సాప్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top