షావోమికి షాక్‌: కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌టీవీ

Vu in association with Google launches Voice Activated Vu Official Android 7.0 TV - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రము​​ఖ టీవీ బ్రాండ్లకు షాకిచ్చేలా వీయూ టెక్నాలజీస్‌ టీవీ మార్కెట్‌లోకి దూసుకువచ్చింది.  అత్యాధునిక ఫీచర్లతో  ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేసినట్టు మంగళవారం ప్రకటించింది.  ఆండ్రాయిడ్‌  7.1 నౌగాట్‌   ఆధారంగా  తమ 4కేటీవీలు పని చేస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో  వెల్లడించింది.   43, 49, 55  ఇంచెస్‌  వేరియంట్లలో  ఈ 4కే స్మార్ట్‌ టీవీలను అందిస్తున్నామని వీయూ టెక్నాలజీసీ సీఈవో , ఫౌండర్‌ దేవితా సరాఫ్‌  తెలిపారు.

గత ఏడాదిగా అనేక విజయవంతమైన పరీక్షల తర్వాత ఈ హైఎండ్‌ టెక్నాలజీతో కూడిన,  హై క్వాలిటీ పిక్చర్‌, సౌండ్‌ కలగలసిన విప్లవాత్మక  ప్రొడక్ట్‌ను లాంచ్‌ చేశామని సంస్థ సీఈవో  వెల్లడించారు.  43 అంగుళాల టీవీ ధర రూ.. 36,999గాను, 49 అంగుళాల  వేరియంట్‌ టీవీ ధర  రూ. 46,999, 55 అంగుళాల  వేరియంట్‌ టీవీ ధర రూ. 55,999గా  నిర్ణయించినట్టు చెప్పారు.ఈ స్మార్ట్‌టీవీలు  ఫ్లిప్‌కార్ట్‌, వియూ స్టోర్లలో  మార్చి 16వ తేదీనుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. క్వాడ్-కోర్ ప్రాసెసర్ , 2.5 జీబీ ర్యామ్‌,  16జీబీ స్టోరేజ్‌, డాల్బీ డిజిటల్ ఆడియో సపోర్ట్‌  ఈ టీవీల  ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి.

దీంతో ఇటీవల టీవీ మార్కెట్‌లోకి దూసుకువచ్చిన చైనా మొబైల్‌ మేకర్‌ షావోమికి  గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అలాగే ఇప్పటికే టీవీ సెగ్మెంట్‌లో ప్రత్యర్థులకు ప్రధాన పోటీ ఇస్తున్న కొరియన్‌ సంస్థ శాంసంగ్‌కు వీయూ  మరో ప్రత్యర్థి  అవుతుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top