వివో జెడ్‌1 ఎక్స్‌ : సూపర్‌ ఫీచర్లు

Vivo Z1x launched at Rs 16990 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనాకు చెందిన  మొబైల్‌ తయారీదారు వివో  తన  జెడ్‌  సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను  ఆవిష్కరించింది.  వివో జెడ్ 1 ఎక్స్  పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ రెండవ ఫోన్.  ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 సాక్‌, 22 వాట్‌ ఫ్లాష్‌చార్జ్‌ స్పెషల్‌ ఫీచర్లుగా ఉన్నాయి. ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో  లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌,  ఫ్లిప్‌కార్ట్,  వివో  ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.   

6 జీబీర్యామ్/ 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .16,990. 
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్   ధర  రూ.18,990 

ఆఫర్ల విషయానికొస్తే, వివో జెడ్ 1 ఎక్స్ ఫోన్ కొనుగోలుపై రిలయన్స్ జియో రూ .6,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు రూ .1,250 ఆఫర్‌ కూడా ఉంది.  సెప్టెంబర్ 13 నుండి అమ్మకానికి లభ‍్యం.

వివో జెడ్ 1 ఎక్స్   ఫీచర్లు
6.38-అంగుళాల సూపర్ అమోలెడ్‌ వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లే  
స్నాప్‌డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9 పై  
48+ 2+8 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌  కెమెరా . 
32 ఎంపీ సెల్పీ కెమెరా
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top