రియల్టీ అలెక్సా! 

Virtual Assistant services have been extended into real estate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెజాన్‌ అభివృద్ధి చేసిన వర్చువల్‌ అసిస్టెంట్‌ (వాస్తవిక సహాయకుడు) సేవలు రియల్‌ ఎస్టేట్‌లోకి విస్తరించాయి. సింగపూర్‌కు చెందిన డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఎలారా టెక్నాలజీస్‌ స్థిరాస్తికి సంబంధించి తాజా వార్తలు, విశేషాల కోసం అలెక్సా కంపాటిబుల్‌ స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో హౌసింగ్‌.కామ్, ప్రాప్‌టైగర్‌.కామ్, మకాన్‌.కామ్‌ల్లోని వార్తలు, ధరలు, బ్లాగ్‌ విశేషాలను అలెక్సా అందిస్తుంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా వాయిస్‌ ఆధారిత రియల్టీ సెర్చింగ్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని.. మన దేశంలో ఇది 28 శాతం వరకు, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం వరకుంటుందని’’ గ్రూప్‌ సీపీటీవో రవి భూషన్‌ తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top