విజయ్‌ మాల్యా మస్త్‌ మస్త్‌గా..

Vijay Mallya Spotted At India Australia World Cup Match - Sakshi

లండన్: వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఇంగ్లండ్‌లో జరగుతున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జరగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూసేందుకు మైదానానికి వచ్చి మీడియా కంటికి చిక్కాడు. దీంతో మాల్యాను ఎగవేత, అప్పగింతపై మీడియా ప్రశ్నించగా తాను మ్యాచ్‌ చూసేందుకు వచ్చానని చెప్పి స్టేడియం లోపలకు వెళ్లిపోయాడు.

ఇక విజయ్ మాల్యా అప్పగింత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. విజయ్ మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. లండన్ హై కోర్టులో జూలై 2న విచారణ ఉంది. భారతీయ జైళ్లు సురక్షితం కావన్న వాదనతో కోర్టులో పోరాడుతున్నాడు. విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలుకు పారిపోయిన విషయం తెలిసిందే.

చదవండి:
నాకే ఎందుకిలా..? మాల్యా 
నా ఆస్తుల జప్తు అమానుషం: మాల్యా 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top