ఉజ్జీవన్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  బంపర్‌ లిస్టింగ్‌

 Ujjivan Small Finance Bank shares make bumper debut on BSE, NSE after listing - Sakshi

సాక్షి,ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ బంపర్‌ లిస్టింగ్‌ను నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను మించి లిస్టింగ్‌లో దూసుకు పోయింది.  స్టాక్‌మార్కెట్లలో గురువారం లిస్ట్‌ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు ఏకంగా 60 శాతం ప్రీమియంతో రూ. 62 వద్ద లిస్ట్‌ అయింది. గత వారం తన 750 కోట్ల ఐపీవోలో 165 రెట్లు సబ్‌స్క్రైబ్‌  అయిన సంగతి తెలిసిందే.

ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37 కాగా ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. దీంతో గ్రే మార్కెట్లో ఈ స్టాక్‌పై అంచనాలు అధికమయ్యాయి. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టింగ్‌ జరగవచ్చని నిపుణలు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను మించి ఇష్యూ ధర కంటే 60 శాతం అధికం కావడం విశేషం. అలాగే  పేరెంట్‌ కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.4,300 కోట్ల కన్నా ఎక్కువ. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top