హ్యాకింగ్‌ షాక్‌:హ్యాకర్లకు ఉబెర్‌ భారీ చెల్లింపులు

Uber paid hackers $100,000, concealed data stolen from 57 million accounts - Sakshi - Sakshi - Sakshi - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్‌ మరోసారి హ్యాకింగ్‌బారిన పడింది.  ఈ విషయాన్ని స్వయంగా సంస్థ  ధృవీకరించింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాహ్యాకింగ్‌ గురైనట్టు రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉబెర్‌  మంగళవారం ప్రకటించింది. అంతేకాదు  హ్యాక్‌ అయిన సమాచారాన్ని తొలగించేందుకు  హ్యాకర్లకు భారీ  ఎత్తున చెల్లింపులు కూడా చేసిందట. హ్యాకర్లకురూ. 1,00,000 డాలర్లు ( సుమారు రూ.65కోట్లు) చెల్లించింది.  ఈ వ్యవహారంలో ఉబెర్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌  జో సుల్లివాన్,  డిప్యూటీ అధికారి  క్రైగ్ క్లార్క్‌లపై వేటువేసింది.   

హ్యాకింగ్‌ విషయాన్ని ఉబర్‌ సీఈవో డారా ఖోస్రోషాహి  తన బ్లాగ్‌ పోస్ట్‌ లో ధ్రువీకరించారు. 2016 అక్టోబరులో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవలే తెలుసుకున్నామని చెప్పారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. దీన్ని తాము  ఉపేక్షించమని డారా  స్పష్టం చేశారు.  గత ఏడాది అక్టోబర్‌లో  హ్యాకర్లు  ఈ డేటాను హ్యాక్‌ చేశారన్నారు.  సంస్థ క్లౌడ్‌ సర్వర్‌ ద్వారా  డేటాను హ్యాక్‌ చేశారన్నారు.  ఇందులో రైడర్ల పేర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్‌ల వివరాలు ఉన్నట్లు ఉబర్‌ పేర్కొంది.  గతాన్ని తుడిచిపెట్ట లేం. కానీ  పొరపాట్లనుంచి నేర్చుకుంటామనీ,ఇందుకు  ప్రతి యుబెర్ ఉద్యోగి తరఫున హామీ  ఇస్తున్నానని ఖోస్రోషాహి చెప్పారు. ప్రతి అంశంలో  వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడానికి కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు.

హ్యాకింగ్‌ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈవో, ఉబర్‌ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్‌ కలోనిక్‌కు తెలిసిందట. అయితే సీఈవో అధికారికంగా ప్రకటించేవరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు. దొంగలించిన  ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని సీఈవో డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  

ఈ హ్యాకింగ్‌ విషయాన్ని దాచి పెట్టిన  ఉబెర్‌ హ్యాకింగ్‌పై  ప్రత్యేక బోర్డు కమిటీతో  విచారణ చేపట్టిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత అధికారులు వెల్లడించారు.  మరోవైపు   దొంగిలించిన సమాచారాన్ని డిలీట్‌ చేసేందుకు ఆయా సం‍స్థలు భారీగా చెల్లింపులు చేస్తున్నాయని అమెరికాఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌  ఏజెన్సీ అధికారులు,  ప్రయివేట్‌ సెక్యూరిటీ అధికారులు వ్యాఖ్యానించారు. ఇలాంటి చెల్లింపులు చేస్తున్న సంస్థల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు.    కాగా 2014 లో గాడ్ వ్యూ అని పిలిచే ఒక సాఫ్ట్‌వేర్‌ ద్వారా  గతంలో యుబెర్ డ్రైవర్ల, వినియోగదారుల సమాచారం  హ్యాకింగ్‌కు గురైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top