ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ఇద్దరు ఎన్నారై డాక్టర్లు | Two Indian-American doctors charged in insider trading scheme | Sakshi
Sakshi News home page

ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ఇద్దరు ఎన్నారై డాక్టర్లు

Apr 27 2014 12:36 AM | Updated on Oct 17 2018 4:36 PM

ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా 3,00,000 డాలర్ల మేర అనుచిత లబ్ధ్ది పొందారంటూ ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.

 న్యూయార్క్: ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా 3,00,000 డాలర్ల మేర అనుచిత లబ్ధ్ది పొందారంటూ ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో సుకేన్ షా, షిముల్ షా అనే ఇద్దరు ప్రవాస భారతీయ డాక్టర్లు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. జీఎస్‌ఐ కామర్స్ అనే సంస్థను 2011లో ఈబే సంస్థ కొనేందుకు సిద్ధమైంది.

 

సదరు జీఎస్‌ఐ కామర్స్ సీఈవో క్రిస్టొఫర్ సారిడాకిస్.. ఈ విషయాన్ని అనధికారికంగా సుకేన్, షిముల్ తదితరులకు తెలియజేశారు. దీంతో ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా వీరు లాభాలు పొందారని అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద కేసు సెటిల్ చేసుకోవాలంటే ఎన్నారై డాక్టర్లతో పాటు అయిదుగురు ట్రేడర్లు 4,90,000 డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదే శించింది. క్రిస్టోఫర్‌పై 6,64,822 డాలర్ల పెనాల్టీ విధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement