టీవీఎస్‌ కొత్త అపాచీ బైక్‌ లాంచ్‌...ధర ఎంత? | TVS Apache RR 310 India Launch  | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ కొత్త అపాచీ బైక్‌ లాంచ్‌...ధర ఎంత?

Dec 6 2017 12:33 PM | Updated on Mar 23 2019 9:28 PM

TVS Apache RR 310 India Launch  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కొత్త  సూపర్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. ఇండియన్ మార్కెట్లో  అపాచీ ఆర్‌ఆర్‌ 310 పేరుతో  దీన్ని విడుదల చేసింది. రెడ్ కలర్ పెయింట్ స్కీము ఫినిషింగ్  అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌ను   రేస్ స్పెక్ ట్రెల్లిస్ ఫ్రేమ్, డెవిల్ హార్న్  ఎల్ఇడి టెయిల్ లైట్‌తో అభివృద్ది చేసింది. ఫాస్ట్‌, ఏరో డైనమిక్‌, స్పోర్టీ లుక్‌లో సరికొత్త  అపాచీ 310 ఆర్‌ఆర్‌  బైక్‌ లవర్స్‌కు స్పోర్టీ అనుభవాన్ని అందిస్తుందనీ, 2.9 సెకండల్లో గరిష్టంగా 160 కెఎంపీహెచ్‌ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ.2.05 లక్షలు(ఎక్స్‌షోరూం-ఢిల్లీ)గా నిర్ణయించింది. బుకింగ్స్‌ వెంటనే ప్రారంభం కానుండగా,  ఈ నెలాఖరుకు డెలివరీ ఇవ్వనుంది. దాదాపు 60దేశాల్లో ఈ సూపర్‌ బైక్‌ వినియోగదారులకు  అందుబాటులో ఉంచనుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి 310 జిఎస్ బైకుల్లో పొందుపర్చిన ఇంజీన్‌ తో  దీన్ని రూపొందించడం విశేషం. అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెర్టికల్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఇరు వైపులా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  313 సీసీ కెపాసిటి సింగల్ సిలిండర్ ఇంజన్,  గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా కేటిఎమ్ ఆర్‌సి 390, కవాసకి నింజా 300 , బెనెల్లీ 302ఆర్ వంటి మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనివ్వనుందని మార్కెట్‌వర్గాల అంచనా. మరోవైపు తొలి ఏడాదిలో 10వేల  యూనిట్లను  విక్రయించాలని టీవీఎస్‌ మోటార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement