ఇక ఫ్రీడం రూ.251 అంతేనా?

ఇక ఫ్రీడం రూ.251 అంతేనా? - Sakshi


న్యూఢిల్లీ:  నోయిడా కు చెందిన   స్మార్ట్ ఫోన్ తయారీ దారు రింగింగ్ బెల్స్  భారీ కష్టాల్లో  ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది.  ప్రపంచంలో నే అతి చవకైన ఫోన్ అంటూ  సంచలనం సృష్టించిన   ఫ్రీడం రూ. 251  స్మార్ట్ ఫోన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నవాళ్లు ఇక నీళ్లు వదలు  కోవాల్సిందేనా అన్న అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాల పడుతూ వస్తున్న ఈ ఫోన్ల్ జారీ ప్రక్రియ ..తాజా వార్తల నేపథ్యంలో  మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.





ఫిబ్రవరిలో ఫోన్ ఆవిష్కరణ తర్వాత భారీ బుకింగ్స్ ను  సాధించిన ప్పటికీ,  తన మొదటి ఫోన్  డెలివరీ ఇంకా స్టార్ట్ కాకముందే ఇబ్బందులను ఎదుర్కొంటోంది.  కంపెనీ వాగ్దానం  చేసినట్టుగా  ఫోన్లను అందించడంలో పలుమార్లు విఫలమైన సంస్థ  యాజమాన్యం మధ్య విభేదాలు చెలరేగినట్టు తెలుస్తోంది.  మేనేజ్మెంట్ స్థాయిలో ఆర్థిక పరంగా తీవ్రమైన విభేదాలు నెలకొన్నట్టు సమాచారం. దీంతోపాటు ఫ్రీడం 251  ఫోటోను వెబ్  సైట్ (రింగింగ్ బెల్స్.కో.ఇన్) నుంచి తొలగించడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.  అలాగే మిగతా స్మార్ట్ ఫోన్ల కోసం వెతికినపుడు, బై నౌ బటన్ ప్రెస్ చేస్తే.. 72 గంటల్లో  అమ్మకాలు పూర్తయ్యాయని ... తొందర్లోనే బుకింగ్ మొదలు కానున్నాయి అన్న సందేశం దర్శనమిస్తుండడం విశేషం.



కంపెనీ అధ్యక్షుడిగా పరిచయమైన అశోక్ చద్దా సీఈవో మోహిత్ గోయల్ మధ్య తీవ్రమైన ఆర్థిక విభేదాలు వచ్చాయినీ.. అందుకే సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండడం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై చద్దాను  వివరణ కోరినపుడు  రింగింగ్ బెల్స్  కి తాను పనిచేయడంలేదనీ  సలహాదారుగా మాత్రమేనని సమాధానం చెప్పారు.  అటు సీఈవో మొహిత్  గోయల్  కు ఫోన్ చేసినపుడు ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు నష్టాల్లో ఉన్న కంపెనీ గట్టెక్కించే నాధుడు కోసం వేచి చూస్తోంది.  



కాగా ఈ ఫ్రీడం ఫోన్ తయారీకి 1200  రూ. ఖర్చవుతోందని , కానీ వినియోగదారుల కోసం రూ.251 కే అందించనున్నామని ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ఒక్కో యూనిట్ కు సుమారు రూ 900 ల భారీ నష్టానికే సరఫరా చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ నష్టాలు.. వివాదాల్లో రింగింగ్ బెల్స్ కూరుకు పోయిన సంగతి తెలిసిందే. అయితే జులై 7న తమ ఫ్రీడం 251  స్మార్ట్ ఫోన్ ను  వినియోగదారులకు అందించినున్నట్టు ఇటీవల గోయల్ ప్రకటించారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మద్దతును కోరునున్నట్టు ప్రకటించడం గమనార్హం.



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top