హెచ్‌ఆర్‌ఏ ఆధ్వర్యంలో రియల్టర్లకు శిక్షణ శిబిరం | training development with hra in real estate | Sakshi
Sakshi News home page

హెచ్‌ఆర్‌ఏ ఆధ్వర్యంలో రియల్టర్లకు శిక్షణ శిబిరం

Jul 21 2017 10:46 PM | Updated on Sep 5 2017 4:34 PM

హెచ్‌ఆర్‌ఏ ఆధ్వర్యంలో రియల్టర్లకు శిక్షణ శిబిరం

హెచ్‌ఆర్‌ఏ ఆధ్వర్యంలో రియల్టర్లకు శిక్షణ శిబిరం

స్థిరాస్తి రంగంలో జ్ఞాన సముపార్జన, విస్తరణ, వ్యాపార వనరులు, నైపుణ్య శిక్షణాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా..

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి రంగంలో జ్ఞాన సముపార్జన, విస్తరణ, వ్యాపార వనరులు, నైపుణ్య శిక్షణాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్‌ రియల్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ) ఇటీవల నగరంలో సర్టిఫైడ్‌ ప్రాపర్టీ స్పెషలిస్ట్‌ పేరిట ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 270 మంది రియల్టీ కన్సల్టెంట్లు, ఏజెంట్లు ఈ శిబిరంలో పాల్గొన్నారని హెచ్‌ఆర్‌ఏ ప్రెసిడెంట్‌ ఏ సుమంత్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఏలో 130 మంది సభ్యులున్నారు. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ ఇండియా (ఎన్‌ఏఆర్‌–ఇండియా) అనుబంధ సంస్థే ఈ హెచ్‌ఆర్‌ఏ.

సదాశివపేటలో 300 ఎకరాల్లో లే అవుట్‌..
తొలిసారిగా నగర శివారు ప్రాంతాల్లో పలు లేఅవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయిం చాం. సదాశివపేటలో 300 ఎకరాలు, శ్రీశైలం హైవేలో 38 ఎకరాల్లో వెంచర్లను ప్రారంభించనున్నాం. తెలం గాణలో రెరా బిల్లు అమల్లోకి వచ్చాక అందులోని నియమ నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేశాకే.. లే అవుట్‌ అనుమతులు, అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం. గతంలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, తగరపువలసలో 28 ఎకరాల్లో రెండు వెంచర్లను విజయవంతంగా పూర్తి చేశాం.

Advertisement
 
Advertisement
Advertisement