breaking news
training development
-
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం
న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్ రాబోతోంది. అదే యోగా బ్రేక్.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ వై–బ్రేక్ యాప్ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్ సమయంలో వై–బ్రేక్ యాప్‌లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ యాప్‌లో ఏముంది ? పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్‌ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్ యాప్‌ని ప్రారంభించింది. -
హెచ్ఆర్ఏ ఆధ్వర్యంలో రియల్టర్లకు శిక్షణ శిబిరం
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో జ్ఞాన సముపార్జన, విస్తరణ, వ్యాపార వనరులు, నైపుణ్య శిక్షణాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) ఇటీవల నగరంలో సర్టిఫైడ్ ప్రాపర్టీ స్పెషలిస్ట్ పేరిట ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 270 మంది రియల్టీ కన్సల్టెంట్లు, ఏజెంట్లు ఈ శిబిరంలో పాల్గొన్నారని హెచ్ఆర్ఏ ప్రెసిడెంట్ ఏ సుమంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏలో 130 మంది సభ్యులున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (ఎన్‌ఏఆర్–ఇండియా) అనుబంధ సంస్థే ఈ హెచ్ఆర్ఏ. సదాశివపేటలో 300 ఎకరాల్లో లే అవుట్.. తొలిసారిగా నగర శివారు ప్రాంతాల్లో పలు లేఅవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయిం చాం. సదాశివపేటలో 300 ఎకరాలు, శ్రీశైలం హైవేలో 38 ఎకరాల్లో వెంచర్లను ప్రారంభించనున్నాం. తెలం గాణలో రెరా బిల్లు అమల్లోకి వచ్చాక అందులోని నియమ నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేశాకే.. లే అవుట్ అనుమతులు, అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం. గతంలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, తగరపువలసలో 28 ఎకరాల్లో రెండు వెంచర్లను విజయవంతంగా పూర్తి చేశాం.