టాప్‌ ఇండియన్‌ ఎగ్జిక్యూటివ్‌ కాల్చివేత | Top Indian Executive Of Cement Company Gunned Down In Ethiopia | Sakshi
Sakshi News home page

టాప్‌ ఇండియన్‌ ఎగ్జిక్యూటివ్‌ కాల్చివేత

May 17 2018 2:51 PM | Updated on May 17 2018 6:04 PM

Top Indian Executive Of Cement Company Gunned Down In Ethiopia - Sakshi

ఓ టాప్‌ ఇండియన్‌ ఎగ్జిక్యూటివ్‌ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. నైజిరియాకు చెందిన డాగెంట్‌ సిమెంట్‌ కంపెనీకి కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్న దీప్‌ కామ్రాను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇథియోపియాలో హత్య చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా వారు హత్య చేశారు. 

సిమెంట్‌ ఫ్యాక్టరీ నుంచి అడ్డిస్ అబాబా​కు తిరుగు ప్రయాణమైన దీప్‌ కామ్రాను ఓరోమియా ప్రాంతంలో దుండగులు అడ్డగించి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కామ్రాతో పాటు ఆయన సెక్రటరీ, డ్రైవర్‌ కూడా మరణించినట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆ దుండగులను పట్టుకోవడానికి సెక్యురిటీ బలగాలు రంగంలోకి దింపినట్టు పేర్కొంది. నైజిరియాకు చెందిన డాంగెట్‌ కంపెనీ ఆఫ్రికాలో 10 ప్రాంతాల్లో తన కార్యకాలపాలను సాగిస్తోంది. ఇథియోపియాలో అతిపెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారిగా డాంగెట్‌ కంపెనీ ఉంది. అత్యధిక నైపుణ్యమున్న 32.5, 42.5 గ్రేడ్‌ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తూ.. మార్కెట్‌ అవసరాలను ఇది అతి సులువుగా చేధిస్తోంది. 

     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement