జియో మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ : వివరాలివే!

From Today, Reliance Jio Monsoon Hungama To Offer Rs 501 JioPhone - Sakshi

ముంబై : ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ప్రకటించిన మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఒక్క రోజు ముందుగానే మాన్‌సూన్‌ ‘హంగామా’ ఆఫర్‌ను రిలయన్స్‌ జియో లాంచ్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ కింద కేవలం 501 రూపాయలకే జియోఫోన్‌ను కస్టమర్లకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 41వ వార్షికోత్సవ సమావేశంలో రిలయన్స్‌ జియో ఈ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 21 నుంచి ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తామని తెలిపింది. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే నేటి నుంచే ఈ స్కీమ్‌ను రిలయన్స్‌ ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం 5.01 గంటల నుంచి ఈ స్కీమ్‌ ప్రారంభమవుతుందని, ఇది జియోఫోన్‌ ఆఫర్‌ ధరను ప్రతిబింబిస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ఈ కొత్త జియోఫోన్‌ రిజిస్ట్రేషన్లను సైతం కంపెనీ తన అధికారి వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. 

ఆగస్టు 15 నుంచి కొత్త, పాత జియోఫోన్‌ యూజర్లకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ యాప్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్‌ గూగుల్‌ మ్యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న ఈ స్కీమ్‌ కింద మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు తాము వాడే ఏ బ్రాండ్‌కు చెందిన ఫీచర్‌ ఫోన్‌నైనా ఎక్స్చేంజ్‌ చేసుకుని, కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. కాగ, ఇప్పటి వరకు 25 మిలియన్‌ ప్రజలు జియోఫోన్‌ను కొనుగోలు చేశారని రిలయన్స్‌ నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్‌ అంబానీ తెలిపారు. జియోఫోన్‌ 100 మిలియన్‌ కన్జ్యూమర్లను చేరుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఈ స్కీమ్‌ వివరాలను రిలయన్స్‌ జియో ప్రకటించింది. అవేమిటో ఓ సారి చూద్దాం..

 • మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కింద కొత్త జియోఫోన్‌ కోసం యూజర్లు చెల్లించే రూ.501ను మూడేళ్ల తర్వాత రీఫండ్‌ చేయనున్నారు.
 • ఎక్స్చేంజ్‌ చేసే ఫీచర్‌ ఫోన్‌ ఛార్జర్‌తో సహా, మంచి వర్కింగ్‌ కండిషన్‌లో ఉండాలి.
 • కొత్త జియోఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు, పాత ఫీచర్‌ ఫోన్‌ను రిటైలర్‌కు ఇచ్చేయాలి.

జియోఫోన్‌... 

 • జియోఫోన్‌తో పాటు జియో సిమ్‌ కస్టమర్లకు వస్తుంది.
 • పాత నెంబర్‌నే కొనసాగించాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ) పెట్టుకోవాలి. ఎంఎన్‌పీ పెట్టుకున్నాక, మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ పొందాల్సి ఉంటుంది.

స్పెషల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌...

 • మాన్‌సూన్‌ హంగామా కింద స్పెషల్‌ జియోఫోన్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను జియో ప్రవేశపెట్టింది. 
 • ఈ స్పెషల్‌ ప్లాన్‌ కింద రూ.594 చెల్లిస్తే, అపరిమిత వాయిస్‌, డేటా ప్రయోజనాలు ఆరు నెలల పాటు పొందనున్నారు. 
 • అదనంగా మాన్‌సూన్‌ హంగామా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద రూ.101 విలువైన 6 జీబీ స్పెషల్‌ ఎక్స్చేంజ్‌ బోనస్‌ లభ్యం.
 • ఆరు నెలల పాటు మొత్తంగా 90 జీబీ డేటా పొందనున్నారు. 

జియోఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు తీసుకెళ్లాల్సినవి..

 • వర్కింగ్‌ కండీషన్‌లో ఉన్న పాత మొబైల్‌ ఫోన్‌
 • పాత ఫోన్‌ బ్యాటరీ అండ్‌ ఛార్జర్‌
 • ఆధార్‌ నెంబర్‌
 • మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ పెట్టుకుంటే, కొత్త ఎంఎన్‌పీ జియో నెంబర్‌  
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top