ఫోక్స్‌వ్యాగన్ వెంటో.. కొత్త వేరియంట్ | The new variant of the Volkswagen Vento .. | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్ వెంటో.. కొత్త వేరియంట్

Jun 23 2015 11:42 PM | Updated on Sep 3 2017 4:15 AM

ఫోక్స్‌వ్యాగన్ వెంటో.. కొత్త వేరియంట్

ఫోక్స్‌వ్యాగన్ వెంటో.. కొత్త వేరియంట్

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ వెంటోమోడల్‌లో కొత్త వేరియంట్‌లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో

♦ ధరలు రూ.7.85-రూ.11.87 లక్షలు
♦ రెండేళ్లలో ఐదు కొత్త మోడళ్లు
 
న్యూఢిల్లీ : ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ వెంటోమోడల్‌లో కొత్త వేరియంట్‌లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ మిడ్‌సైజ్ సెడాన్ ధరలు రూ.7.85 లక్షలు నుంచి రూ.11.87 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ఉన్నాయని ఫోక్స్‌వ్యాగన్ డెరైక్టర్(ప్యాసింజర్ కార్స్) మైఖేల్ మేయర్ చెప్పారు. 2010లో వెంటోను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 1.1 లక్షల వెంటో కార్లను విక్రయించామని వివరించారు.

భారత్‌లో అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యంగా రెండేళ్లలో ఐదు కొత్త మోడళ్లను అందించనున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు వెంటోను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొన్నారు. 4 మీ. లోపు కాంపాక్ట్ సెడాన్‌ను వచ్చే ఏడాది అందిస్తామని.. కాంపాక్ట్ సెడాన్ బీటిల్‌ను మళ్లీ తేనున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement