24 నుంచి తాజా గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ | The latest gold bond scheme from 24th | Sakshi
Sakshi News home page

24 నుంచి తాజా గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

Apr 21 2017 1:03 AM | Updated on Sep 5 2017 9:16 AM

24 నుంచి తాజా గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

24 నుంచి తాజా గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) తాజా సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది మొదటి గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.

న్యూఢిల్లీ: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) తాజా సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది మొదటి గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌. మార్కెట్‌ విలువకన్నా గ్రాముకు రూ.50 తక్కువగా బాండ్‌ విలువ ఉంటుంది. వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ బాండ్లకు ఏప్రిల్‌ 24–28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. బాండ్ల కాలపరిమితి ఐదవ ఏడాది నుంచి ‘ఎగ్జిట్‌’ ఆప్షన్‌తో ఎనిమిది సంవత్సరాలు.

ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. సబ్‌స్క్రిప్షన్‌కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యూయెలర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్‌ ధర సగటును బాండ్‌ ధరగా స్థిరీకరించడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్, బాంబే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement