టెటాన్‌ లాభం 71% అప్‌ | Tetan's profit up 71 percent | Sakshi
Sakshi News home page

టెటాన్‌ లాభం 71% అప్‌

May 11 2018 12:55 AM | Updated on Jul 29 2019 7:32 PM

Tetan's profit up 71 percent - Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్‌ కంపెనీ నికర లాభం 2017–18 క్యూ4లో 71 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం  క్యూ4లో ఇది రూ.178 కోట్లు. ఇపుడది రూ.304 కోట్లకు పెరిగినట్లు టైటాన్‌ ఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.3,693 కోట్ల నుంచి రూ.4,126 కోట్లకు పెరిగిందని వివరించారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3.75 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.   పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.102 కోట్లకు పెరిగింది.

మొత్తం  ఆదాయం రూ.13,453 కోట్ల నుంచి రూ.16,245 కోట్లకు వృద్ధి చెందింది. కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన టాటా సన్స్‌ నామినీ, నోయల్‌ టాటాను డైరెక్టర్ల బోర్డ్‌కు వైస్‌ చైర్మన్‌గా  నియమించామని భట్‌ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టైటాన్‌ షేర్‌ 1.3% నష్టపోయి రూ.973 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement