టీసీఎస్‌కు ఫలితాల షాక్‌

CS share price falls over 3 percent  after Q2 earnings miss estimates - Sakshi

సాక్షి, ముంబై:  ఐటీ మేజర్‌  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)కు క్యూ2  ఫలితాల షాక్‌ తగిలింది.  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలో 400 పాయింట్లకు పైగాఎగిసినప్పటికీ టీసీఎస్‌ షేరు టాప్‌ లూజర్‌గా నిలిచింది.  సెప్టెంబరు త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోలేక పోవడంతోశుక్రవారం టీసీఎస్‌ షేర్లు  4 శాతం  క్షీణించాయి. అటుకీలక సూచీలు కూడా  ట్రేడర్ల అమ్మకాలతో భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్‌,నిఫ్టీ కీలకమద్దతుస్థాయిలను కోల్పోయి స్వల్ప లాభాలతో తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. 

గురువారం  మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4శాతంగా నమోదైంది.రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి రూ. 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండుతో పాటు రూ. 40 మేర ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించాలని టీసీఎస్‌ బోర్డు నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్‌ 18. చెల్లింపు తేదీ అక్టోబర్‌ 24. 

చదవండి : టీసీఎస్‌..అంచనాలు మిస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top