టాటా మోటార్స్‌కు ట్రంప్‌ షాక్‌

Tata Motors stock top loser on Sensex after Donald Trump warns of  import tariff - Sakshi

సాక్షి, ముంబై:  వివిధ దేశాల మధ్య ముదుతున్న ట్రేడ్‌ వార్‌  నేపథ్యంలో వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు  ట్రంప్‌ షాక్‌ తగిలింది. ఈయూకార్లపై దిగుమతిసుంకం విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   హెచ్చరికల నేపథ్యంలో ఇవాల్టి మార్కెట్‌లో టాటా మోటార్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.  5.94 శాతం నష్టంతో ముగిసింది.  ఐరోపాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా యూరోపియన్‌ యూనియన్‌ ఉత్పత్తి చేసే కార్లపై 20శాతం దిగుమతి సుంకం విధించనున్నట్టు  ట్రంప్‌ తాజాగా హెచ్చరించారు.  ట్రంప్ ఆటో టారిఫ్‌లను పెంచినట్లయితే  అమెరికాకు ఎక్కువగా  ఎగుమతి చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్‌ఆర్‌) వాహనాలపై భారీ ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా ట్యాక్స్‌ల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్కు దిగుమతులపై 25శాతం, అల్యూమినియం దిగుమతులపై 10శాతం ట్యాక్స్ పెంచి ట్రేడ్‌ వార్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌, ఈయూ దేశాలు అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై దిగుమతి సుంకాన్నిపెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. భారత్‌  29 ఉత్పత్తులపై ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ పెంచగా, యూరోపియన్‌ యూనియన్‌ అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం 25శాతం   సుంకం పెంచిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top