టాటా మోటార్స్‌ నష్టాలు రూ.188 కోట్లు

Tata Motors Reports Q2 Net Loss At Rs 188 Crore - Sakshi

44 శాతం తగ్గిన దేశీయ అమ్మకాలు 

లాభాల బాటలో జేఎల్‌ఆర్‌

రూ.10,000 కోట్ల నిధుల సమీకరణ  

న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న  మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచి్చన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోలి్చతే నష్టాలు బాగానే తగ్గాయి.  గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.65,432 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్‌ తెలిపింది. అయితే స్డాండ్‌అలోన్‌ పరంగా చూస్తే,  గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో మాత్రం రూ.1,282 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్‌ సీఈఓ గుంటర్‌ బశ్చెక్‌ చెప్పారు. దేశీయంగా హోల్‌సేల్స్‌ వాహన విక్రయాలు 44 శాతం తగ్గి 1,06,349కు తగ్గాయని తెలిపారు.

సుదీర్ఘ మందగమనం కారణంగా వాహన విక్రయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండటం, కొత్త యాక్సిల్‌ లోడ్‌ నిబంధనలు, నిధుల కొరత, వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం... ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయన్నారు. ఫలించిన ‘ప్రాజెక్ట్‌ ఛార్జ్‌’..... లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) హోల్‌సేల్స్‌ అమ్మకాలు 3 శాతం పెరిగి 1,34,489 కు పెరిగాయని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాల్ఫ్‌ స్మెత్‌ చెప్పారు.  

రూ.10,000 కోట్ల సమీకరణ
రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని టాటా మోటార్స్‌ వెల్లడించింది. మాతృ కంపెనీ టాటా సన్స్‌కు ఒక్కో షేర్‌ను రూ.150 ధరకు ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన షేర్లు, వారంట్ల జారీ ద్వారా రూ.6,494 కోట్లు సమీకరిస్తామని, అలాగే విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.3,024 కోట్లు చొప్పున ఈ నిధులను సమీకరిస్తామని తెలిపింది.
ఆరి్థక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేర్‌ 5 శాతం నష్టంతో రూ.127 వద్ద ముగిసింది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top