జపాన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం టకీడా, వ్యాక్సిన్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయాలాజికల్ ఈ (బీఈ) రెండు లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం టకీడా, వ్యాక్సిన్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయాలాజికల్ ఈ (బీఈ) రెండు లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా అందుబాటు ధరలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తాయి. తట్టు, కోరింత దగ్గు వ్యాక్సిన్లను భారీ ఎత్తున తయారు చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఈకి టకీడా బదిలీ చేస్తుంది. భారత్, చైనాతోపాటు అల్ప, మధ్యస్థ ఆదాయ దేశాల్లో ఈ వ్యాక్సిన్లను బీఈ విక్రయిస్తుంది. కొత్త మార్కెట్లకు విస్తరించేందుకు ఒప్పందం దోహదం చేస్తుందని బీఈ ఎండీ మహిమ దాట్ల ఈ సందర్భంగా తెలిపారు.


