breaking news
Takeda Pharma
-
డెంగ్యూ టీకా ఇక తీసుకోవచ్చు.. డీసీజీఐ అనుమతులు
న్యూఢిల్లీ: డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన ’క్యూడెంగా’ టీకా మార్కెటింగ్‌కి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు లభించినట్లు టకెడా బయోఫార్మా ఇండియా వెల్లడించింది. డెంగ్యూకి సంబంధించి భారత్‌లో ఆమోదం లభించిన ఈ తొలి టీకాను, 4–60 ఏళ్ల వయస్సు గలవారు తీసుకోవచ్చు.2022లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ వేక్సిన్కి 43 దేశాల్లో ఆమోదం లభించిందని, అంతర్జాతీయంగా 3.2 కోట్ల డోస్‌లు సరఫరా అయ్యాయని టకెడా ఇంటర్కాంటినెంటల్ మార్కెట్స్ విభాగం హెడ్ మహేందర్ నాయక్ తెలిపారు. తమ గ్లోబల్ క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫలితాల ఆధారంగా భారత్‌లో దీనికి ఆమోదం లభించినట్లు వివరించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధి 125 దేశాల్లో ఉంది. మొత్తం కేసుల్లో భారత్ వాటా మూడో వంతు ఉంటోంది. -
టకీడా ఫార్మాతో బీఈ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం టకీడా, వ్యాక్సిన్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయాలాజికల్ ఈ (బీఈ) రెండు లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా అందుబాటు ధరలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తాయి. తట్టు, కోరింత దగ్గు వ్యాక్సిన్లను భారీ ఎత్తున తయారు చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఈకి టకీడా బదిలీ చేస్తుంది. భారత్, చైనాతోపాటు అల్ప, మధ్యస్థ ఆదాయ దేశాల్లో ఈ వ్యాక్సిన్లను బీఈ విక్రయిస్తుంది. కొత్త మార్కెట్లకు విస్తరించేందుకు ఒప్పందం దోహదం చేస్తుందని బీఈ ఎండీ మహిమ దాట్ల ఈ సందర్భంగా తెలిపారు.


