స్వచ్ఛ భారత్‌లో ఐసీఐసీఐ చీఫ్ కొచర్ | Swachh Bharat Abhiyan: Now, ICICI CEO Chanda Kochhar brooms away dirt | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్‌లో ఐసీఐసీఐ చీఫ్ కొచర్

Nov 12 2014 1:40 AM | Updated on Aug 15 2018 2:20 PM

స్వచ్ఛ భారత్‌లో ఐసీఐసీఐ చీఫ్ కొచర్ - Sakshi

స్వచ్ఛ భారత్‌లో ఐసీఐసీఐ చీఫ్ కొచర్

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్ పాల్గొన్నారు.

ముంబై: స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్ పాల్గొన్నారు. మంగళవారం ముంబైలోని ఐసీఐసీఐ బ్యాక్‌బే రిక్లమేషన్ బ్రాంచ్ సమీపంలో ఆమె, ఇతర ఉద్యోగులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చందా కొచర్ వ్యాఖ్యానించారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐసీఐసీఐ బ్రాంచ్‌ల సమీపంలోని ప్రాంతాలను శుభ్రపరుస్తామని, ఈ కార్యక్రమం ఏడాది పొడవునా నిర్వహిస్తామని వివరించారు. పటిష్టమైన, పరిశుభ్రమైన భారత దేశాన్ని సాధించడానికి అందరూ కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఐసీఐసీఐ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement