లెసైన్సు పొడిగింపుపై టెల్కోలకు సుప్రీంలో ఎదురుదెబ్బ | Supreme Court rejects telcos' plea for licence extension | Sakshi
Sakshi News home page

లెసైన్సు పొడిగింపుపై టెల్కోలకు సుప్రీంలో ఎదురుదెబ్బ

May 15 2015 2:02 AM | Updated on Sep 2 2018 5:24 PM

స్పెక్ట్రం లెసైన్సుల గడువును పొడిగించాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన టెలికం కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది.

న్యూఢిల్లీ: స్పెక్ట్రం లెసైన్సుల గడువును పొడిగించాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన టెలికం కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. వాటి వాదనల్లో పసలేదంటూ పిటీషన్లను జస్టిస్ జె. చలమేశ్వర్ సారథ్యం లోని బెంచ్ తోసిపుచ్చింది. వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్ తదితర సంస్థలు ఈ పిటీషన్లు వేశాయి. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం లెసైన్సుల గడువును మరో పదేళ్ల పాటు పొడిగించకపోవడంతో పాటు తమ వద్దనున్న స్పెక్ట్రంను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

20 ఏళ్ల పాటు వర్తించేలా గతంలో ఇచ్చిన లెసైన్సు ఒప్పంద నిబంధనల ప్రకారం ప్రభుత్వం మరో 10 ఏళ్ల పాటు పొడిగించాల్సి ఉంటుందని టెల్కోలు వాదించాయి. అయితే, నిబంధనల్లో ‘పొడిగించవచ్చు’ అని మాత్రమే ఉంది కనుక, దానిపై నిర్ణయం తీసుకోవడం అన్నది పరిస్థితులను బట్టి తన విచక్షణపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం వాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement