ఫ్లాట్ ప్రారంభం : బ్యాంకు, రియల్టీ పతనం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 36960 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 10884 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు బలహీనంగానే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, ఫార్మ నష్టపోతుండగా, ఆటో షేర్లు లాభపడుతున్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, ఒబెరాయ్ రియల్టీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, ఎల్‌ఐసీ నష్టపోతున్నాయి. మరో వైపు బ్రిటానియా, ఎస్‌బ్యాంకు, కాఫీ డే లాభపడుతున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి