అదరగొట్టిన ఎస్‌బీఐ

State Bank Of India Profit Triples In September Quarter  - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే... సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభం మూడింతలైంది. రూ.3,012 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో ఆర్జించిన రూ.945 కోట్లతో పోలిస్తే ఇది 218 శాతం అధికం. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం రూ.26,600 కోట్లకు చేరింది. బ్యాంక్‌ ఎన్‌పీఏలు తగ్గాయి. స్థూల ఎన్‌పీఏలు 7.8శాతం నుంచి 7.3శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.07శాతం నుంచి 2.97శాతానికి తగ్గాయి. తాజా మొండిబకాయిలు ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే రూ.16,217 కోట్ల నుంచి రూ.8,805 కోట్లకు తగ్గాయి. శుక్రవారం మధ్యాహ్నం  వెల్లడించిన ఈ ఫలితాల నేపథ్యంలో  ఎస్‌బీఐ షేరు దూసుకుపోతోంది.   ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం లాభంతో రూ.281వద్ద ట్రేడ్‌ అవుతోంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top