ఆ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పడిపోయిందట | Smartphones below Rs 5000 are not selling in India | Sakshi
Sakshi News home page

ఆ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పడిపోయిందట

Feb 14 2020 3:25 PM | Updated on Feb 14 2020 4:28 PM

Smartphones below Rs 5000 are not selling in India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజ సంస్థలకు స్వర్గధామంలా విరాజిల్లుతున్న భారత మార్కెట్లో బడ్జెట్‌ ధరలస్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు వెలవెలబోతున్నాయట.ఒకపుడు బడ్జెట్‌ ఫోన్లు, లేదా ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌గా పేరొందిన ఇండియాలో ఇపుడు ట్రెండ్‌ మారిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. ముఖ్యంగా రూ. 5వేల లోపు  ఖరీదున్న మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

నిజానికి ఈ సూచనలు 2018లోనే మొదలైనాయని కౌంటర్ పాయింట్‌  రీసెర్చ్‌ పరిశోధన తేల్చింది. 2018లో 25శాతం క్షీణించిన ఈ కేటగిరీ అమ్మకాలు 2019 లో 45 శాతానికి పెరిగింది.  ప్రధానంగా ఎంట్రీ లెవల్ కేటగిరీ రూ .5 వేల స్మార్ట్‌ఫోన్‌లలో లభించే మార్జిన్ కంటే దేశంలోని ఇంటీరియర్‌ పరికరాల ఖర్చు ఎక్కువ అవుతోందని  తెలిపింది. అలాగే, ఈ ఫోన్‌ల డిమాండ్ కూడా గణనీయంగా పడిపోయిందని పేర్కొంది. దీనికి తోడు ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లకు మారిపోవడం కూడా ఒక కారణం. అయితే దేశంలో ఇంకా 450 మిలియన్ల ఫీచర్ ఫోన్లు వినియోగంలో ఉన‍్నప్పటికీ, అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు చాలామంది వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. 

మరోవైపు, భారతదేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల సగటు ధర క్రమంగా పెరుగుతోందని ఐడీసీ డేటా ద్వారా తెలుస్తోంది. ఇది 2018లో 159 డాలర్లు (సుమారు రూ. 11,350 ) నుండి 2019 లో 160 డార్లు (సుమారు రూ. 11,421) కు పెరిగింది.  ప్రస్తుతం 170 డాలర్ల (సుమారు రూ. 12,135 ) స్థాయికి చేరింది. ఈ గణాంకాల ప్రకారం బట్టి చూస్తే ఎంట్రీ లెవల్లో  ఎక్కువ ఫోన్లను విక్రయిస్తున్న  ఏకైక ముఖ్యమైన బ్రాండ్ షావోమినే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement