టాప్‌–10లో ఆరు మారుతీవే.. | Six Maruti models among top 10 best-selling PVs in February | Sakshi
Sakshi News home page

టాప్‌–10లో ఆరు మారుతీవే..

Mar 22 2017 1:15 AM | Updated on Sep 5 2017 6:42 AM

టాప్‌–10లో ఆరు మారుతీవే..

టాప్‌–10లో ఆరు మారుతీవే..

దేశీ ప్యాసెంజర్‌ వాహన మార్కెట్‌లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా ఆల్టో
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్‌ వాహన మార్కెట్‌లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి నెలలో బాగా విక్రయమైన టాప్‌–10 కార్ల జాబితాలో మారుతీకి చెందిన ఆరు మోడళ్లు స్థానం దక్కించుకున్నాయి.

సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం..
బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా మారుతీ ఆల్టో నిలిచింది. దీని విక్రయాలు 19,524 యూనిట్లుగా ఉన్నాయి.
14,039 యూనిట్ల విక్రయాలతో మారుతీ డిజైర్‌ రెండో స్థానంలో ఉంది.
మారుతీ వేగనార్‌ మూడో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు 13,555 యూనిట్లుగా ఉన్నాయి.
హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 మాత్రం 12,862 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో ఉంది.
12,328 యూనిట్ల అమ్మకాలతో మారుతీ స్విఫ్ట్‌ ఐదో స్థానంలో నిలిచింది.
హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20 ఆరో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,414 యూనిట్లుగా నమోదయ్యాయి.
మారుతీ విటారా బ్రెజా 10,046 యూనిట్ల అమ్మకాలతో ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
రెనో క్విడ్‌ ఎనిమిదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 9,648 యూనిట్లుగా ఉన్నాయి.
9,002 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్‌ క్రెటా తొమ్మిదో స్థానంలో ఉంది.
మారుతీ సెలెరియో విక్రయాలు 8,315 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఇది పదో స్థానంలో నిలిచింది.
గతేడాది ఇదే నెలలో టాప్‌–10లో నిలిచిన మహీంద్రా బొలెరో, మారుతీ ఓమ్ని మోడళ్లు తాజా జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement