వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో అటు ఈక్విటీ మార్కెట్లలోనూ, ఇటు బులియన్ మార్కెట్లోను లాభాల హవా కొనసాగుతోంది. వెండి మెటల్ కు భారీ పెరిగిన డిమాండ్ నేపథ్యలో పరుగులు పెరుగుతోంది.
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో అటు ఈక్విటీ మార్కెట్లలోనూ, ఇటు బులియన్ మార్కెట్లోను లాభాల హవా కొనసాగుతోంది. వెండి మెటల్ కు భారీ పెరిగిన డిమాండ్ నేపథ్యలో పరుగులు పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ లాభాల్లో కొనసాగాయి. ఇవి సోమవారం నాటి మార్కెట్లో మరింత ధగధగ లాడాయి. ముఖ్యంగా చైనా మార్కెట్ లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం నాడు వెండిధర రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. రూ. 2,155 లాభంతో కేజీ వెండి ధర రూ. 47,715దగ్గర నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. దీంతో నాలుగైదేళ్లుగా కిలో వెండి రూ. 25-35 వేల మధ్య కదలాడిన ధరలు 47వేల మార్క్ ను దాటడం విశేషం.
	సోమవారం యొక్క కదలికలు స్వర్గంగా ఆస్తులు మరియు ఊహాగానాలు కోరుతూ మరింత ద్రవ్య సడలింపు ప్రపంచ వ్యాప్తంగా మానిటరీ పాలసీ సడలింపు అంచనాలతో  పెట్టుబడిదారులు  వెండి, బంగారంలాంటి  మెటల్స్ పై పెట్టుబడులకు  ఉత్సాహంగా ఉన్నారు.  షాంగై మార్కెట్ లో  వెండి ధరలు  చాలా చురుగ్గా కదులుతున్నాయి.6 శాతం గరిష్ట లాభాలను నమోదు చేశాయి. డిసెంబరు నాటి ఫ్యూచర్స్  లో గత నెల 23 శాతం  లాభాలు పడ్డాయి. సిల్వర్ వినియోగం సగంవాటా పరిశ్రమలది కాగా, మిగిలిన సగం భాగం బార్స్,నాణేలు, ఆభరణాలు, ఇతర వస్తువులది.
	అటు పుత్తడి ధర కూడాభారీగానే పెరుగుదలను నమోదు చేసింది. దాదాపుఎంసీఎక్స్  మార్కెట్లో  300 రూ.లకు పైగా  లాభపడి 32 చేరువలోఉంది.   బంగారం ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 100 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650కు చేరుకుంది.రూ.342 లాభపడిన 10 గ్రా. పసిడి ధర  31,805 దగ్గర ఉంది.   అటు సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,357.63 యూఎస్ డాలర్లుగా ఉంది.     
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
