ఎంఎస్‌ఎంఈలకు నిధుల కోసం ఎల్‌ఐసీతో సిడ్బి ఒప్పందం | SIDBI signs MoU with LIC for Fund-of-Fund operations | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు నిధుల కోసం ఎల్‌ఐసీతో సిడ్బి ఒప్పందం

Apr 9 2016 12:45 AM | Updated on Sep 3 2017 9:29 PM

స్టార్టప్‌లు, లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహామివ్వడానికి ఎల్‌ఐసీతో...

హైదరాబాద్: స్టార్టప్‌లు, లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సాహామివ్వడానికి ఎల్‌ఐసీతో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బి) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని సిడ్బి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎల్‌ఐసీతో కలిసి ఒక నిధిని (ఫండ్) ఏర్పాటు చేస్తామని సిడ్బి సీఎండీ శివాజీ పేర్కొన్నారు. మరోవంక గత రెండు దశాబ్దాలుగా వెంచర్ ఫండ్స్‌కు తోడ్పాటునందిస్తున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement