breaking news
Venture Funds
-
నందన్ నీలేకని వీసీ పెట్టుబడులు..రూ.3,000 కోట్లతో రెడీ
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఈసీవో, సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు తెరతీశారు. వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థ ఫండమెంటమ్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రత్యేకించిన ఫ్రంటియర్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఇందుకు ప్రాథమికంగా రూ. 3,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నారు.దేశీయంగా ఏఐ, డీప్‌టెక్ కంపెనీల దన్నుతో ఫండమెంటమ్ ఫ్రంటియర్ అడ్వయిజర్స్(ఎఫ్2ఏ)ను ఏర్పాటు చేశారు. సెబీ అనుమతించిన తొలి ఫండ్.. ఫండమెంటమ్ 3– ఏఐ, డీప్‌టెక్ రూ. 2,000 కోట్లు సమకూర్చనున్నాయి. వీటికి అదనంగా ఎఫ్2ఏ మరో రూ. 1,000 కోట్ల సహపెట్టుబడులను సమీకరించనుంది. ఎఫ్2ఏ టెక్నాలజీ ఆధారిత బిజినెస్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా కన్జూమర్, ఎంటర్ప్రైజ్, ఫిజికల్ ఏఐను లక్ష్యంగా చేసుకోనుంది. -
ఎంఎస్ఎంఈలకు నిధుల కోసం ఎల్ఐసీతో సిడ్బి ఒప్పందం
హైదరాబాద్: స్టార్టప్‌లు, లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రోత్సాహామివ్వడానికి ఎల్ఐసీతో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బి) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని సిడ్బి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎల్ఐసీతో కలిసి ఒక నిధిని (ఫండ్) ఏర్పాటు చేస్తామని సిడ్బి సీఎండీ శివాజీ పేర్కొన్నారు. మరోవంక గత రెండు దశాబ్దాలుగా వెంచర్ ఫండ్స్‌కు తోడ్పాటునందిస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ తెలిపారు.


