భారతీయులకు బాగా పెరిగిన వీసాలు | Sharp increase in UK visas for Indians | Sakshi
Sakshi News home page

భారతీయులకు బాగా పెరిగిన వీసాలు

Dec 12 2017 7:14 PM | Updated on Dec 12 2017 10:32 PM

Sharp increase in UK visas for Indians - Sakshi

న్యూఢిల్లీ : భారతీయులకు యూకే వీసాలు పెరిగాయి. భారతీయులకు జారీచేసిన యూకే వీసాలు గతేడాది కంటే 9 శాతం పెరిగి సెప్టెంబర్‌ నాటికి 5,17,000గా నమోదైనట్టు యూకే ఆఫీసు ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ రెగ్యులర్‌ రిపోర్టు పేర్కొంది. ఈ సంఖ్యలో పర్యాటక వీసాలు 11 శాతం పెరిగి 4,27,000కు చేరుకున్నాయని, వర్క్‌ వీసాలు 53వేల గానే ఉన్నట్టు రిపోర్టు నివేదించింది. యూకేలోఇతర దేశాలతో పోలిస్తే  ఉద్యోగవకాశాల కోసం భారతీయులు ఎక్కువగా వీసాలు పొందుతున్నట్టు తెలిసింది. టైర్‌ 4 స్టూడెంట్‌ వీసా కేటగిరీలో ఎక్కువ మొత్తంలో పెంపుదల చూడొచ్చని రిపోర్టు తెలిపింది. గతేడాది భారతీయులకు 14వేలకు పైగా స్టూడెంట్‌ వీసాలు జారీ అయ్యాయని, అంతకముందు 12 నెలల కాలాల కంటే 27 శాతం ఎక్కువని రిపోర్టు వివరించింది. 

వరుసగా మూడు క్వార్టర్ల నుంచి యూకేలో భారతీయులకు స్టూడెంట్‌ వీసాలు పెరుగుతూ వస్తున్నాయి. యూకే-బ్రిటన్‌ సంబంధాల విషయంలో ఇది చాలా అద్భుతమైన సమయమని భారత్‌కు బ్రిటన్‌ హై కమిషనర్‌ సర్‌  డొమినిక్ ఆస్క్విత్ చెప్పారు. యూకేతో భారత్‌ సంబంధాలు బాగా బలోపేతమవుతున్నాయనే దానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. భారతీయులకు తమ వీసా సర్వీసులు మెరుగ్గా ఉన్నాయని, 90 శాతం దరఖాస్తుదారులు వీసాలు పొందుతున్నారని, 99 శాతం టార్గెట్‌ సమయంలో వీసా అప్లికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement