కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్ల దూకుడు | Sensex Rises  Near 500 Points Nifty Crosses 11300 | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్ల దూకుడు

Mar 12 2019 2:50 PM | Updated on Mar 12 2019 2:50 PM

Sensex Rises  Near 500 Points Nifty Crosses 11300 - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  దూకుడు మీద ఉన్నాయి. ఆరంభంనుంచి  నిన్నటి జోష్‌ను  కొనసాగిస్తున్నాయి.  గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయ ఇన్వెస్టర్‌ల కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా 145 పాయింట్లు ఎగిసింది సెన్సెక్స్‌ 37554 వద్ద, నిఫ్టీ 11310 వద్ద కొనసాగుతున్నాయి.

అన్ని సెక్టార్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు భారీగా లాభపడుతున్నాయి.   ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎల్ అండ్ టీ షేర్‌లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, యూపీఎల్ షేర్లు టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement