ఆరంభ లాభాలు ఆవిరి | Sensex Ends 70 Points Higher Nifty Settles At 11895 | Sakshi
Sakshi News home page

ఆరంభ లాభాలు ఆవిరి

Nov 16 2019 5:16 AM | Updated on Nov 16 2019 5:16 AM

Sensex Ends 70 Points Higher Nifty Settles At 11895 - Sakshi

ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, దేశీయ వృద్ధి సంకేతాలు బలహీనంగా ఉండటంతో సూచీల లాభాలకు గండిపడింది. ఇంట్రాడేలో 364 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ చివరకు 70 పాయింట్ల లాభంతో 40,357 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా ఇంట్రాడేలో 102 పాయింట్లు ఎగసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,895 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకోవడం, ముడి చమురు ధరలు 0.4 శాతం తగ్గడం... సానుకూల ప్రభావం చూపించాయి. టెలికం, బ్యాంక్, పీఎస్‌యూ షేర్లు లాభపడగా, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, ఆయిల్, గ్యాస్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  

మిశ్రమంగా సూచీలు....
గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం సెలవు కావడంతో ఈ వారంలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగింది. ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 33 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయింది. భారత–అమెరికాల మధ్య వాణిజ్య విభేదాలు సమసిపోయి ఒప్పందం కుదరగలదన్న వార్తలు, అమెరికా–చైనాల మధ్య త్వరలోనే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరగలదన్న అంచనాలతో తొలుత కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరి్థక గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌ పేలవంగా ముగియడం ప్రతికూలం ప్రభావం చూపాయి. దీంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

►భారతీ ఎయిర్‌టెల్‌ 8.4 శాతం లాభంతో రూ. 398  వద్ద ముగిసింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలు వేల కోట్ల నష్టాలను ప్రకటించిన నేపథ్యంలో మొబైల్‌ సేవలకు కనీస టారిఫ్‌ను నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు దీనికి నేపథ్యం.
►మాలి్వందర్, శివిందర్‌ సింగ్‌లపై సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ తీర్పునివ్వడంతో బీఎస్‌ఈలో ఈ కేసుకు సంబంధించి ఫోరి్టస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ ఇంట్రాడేలో 17 శాతం పతనమై రూ.129ను తాకింది. చివరకు 8 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement