దలాల్ స్ట్రీట్ లో చమురు సెగ | sensex ends 1011 points  lower | Sakshi
Sakshi News home page

దలాల్ స్ట్రీట్ లో చమురు సెగ

Apr 21 2020 3:54 PM | Updated on Apr 21 2020 4:04 PM

sensex ends 1011 points  lower - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్  మార్కెట్లు చివరికి భారీ నష్టాలతోనే ముగిసాయి.  క్రూడ్ సంక్షోభంతో ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లను నష్టపోయింది. మిడ్ సెషన్ నుంచి  మరింత నష్టాల్లోకి జారుకున్న దలాల్ స్ట్రీట్ ఒక దశలో 1250 పాయింట్లకు పైగా పతనమైంది. చివరల్లో కొంచెం పుంజుకున్నా ఆఖరి నిమిషంలో  అమ్మకాల వెల్లువ కురిసింది.  దీంతో  సెన్సెక్స్ 1011 పాయింట్లు నష్టపోయి 30637 వద్ద, 280  పాయింట్లు పతనమైన నిఫ్టీ  8961 వద్ద ముగిసింది.  ఫార్మ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిసాయి. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం)

ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు,  హిందాల్కో, జీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, గెయిల్, మారుతి సుజుకి నష్టపోయాయి. మరోవైపు డా.రెడ్డీస్, భారతి ఇన్ ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్, హీరో మోటో, బ్రిటానియా, సిప్లా, రిలయన్స్, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు క్షీణించి రికార్డు  కనిష్టం 76.83  వద్ద ముగిసింది. (ఆల్ టైం కనిష్టానికి రూపాయి)

చదవండి : రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే
సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక
కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement