రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే

lockdown : couple dug a 25 feet deep well at the premises of their house - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా విస్తరణ, లాక్‌డౌన్‌ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వారి వారి  కాలక్షేపాలు, రోజువారి  కార్యక్రమాల వీడియోలు, పోస్టులతో సోషల్  మీడియా హోరెత్తిపోతోంది.  అనేక   సవాళ్లు, ప్రతిసవాళ్లు, టాస్క్ లతో సందడి చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఇంటి పని,  తోట పని భార్యామణికి సాయం అంటూ  ఒకర్ని మించి ఒకరు వీడియోలను  పోస్టు చేస్తున్నారు. ఇలాంటి ఇలాంటి తరుణంలో  ముంబై కి చెందిన ఓ జంట  21 రోజుల లాక్ డౌన్ సమయంలో ఏం  చేశారో తెలిస్తే ఔరా  అనిపించక మానదు (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా)

 కరోనా వైరస్ వ్యాధి భయాలు, లాక్‌డౌన్‌ కారణంగా  పనికోసం బయటికి వెళ్లడానికి లేకపోవడంతో తమ విలువైన సమయాన్ని ఆసక్తికరంగా, నిర్మాణాత్మకంగా గడిపిన తీరు ప్రశంసనీయంగా మారింది. అయిదూ, పది కాదు ఏకంగా 25  అడుగుల బావిని తవ్వుకున్నారు.  ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. అనుకున్నారో ఏమో గానీ, 21 రోజులు  శ్రమించి తమ ఇంటి ప్రాంగణంలో అంత పెద్ద  లోతు బావిని తవ్వారు మహారాష్ట్రలోని  వాషిమ్‌లోని కార్ఖేడా గ్రామానికి చెందిన గజనన్ , అతని భార్య.  బయటికి వెళ్లే పరిస్థితి లేదు కనుక ఏదో ఒకటి చేయాలని ఇద్దరమూ  భావించి, బావి తవ్వేందుకు నిర్ణయించామని గజానన్ చెప్పారు.  (సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top