ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sensex down 28 pts in early trade on profit-booking | Sakshi
Sakshi News home page

ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Oct 20 2015 10:18 AM | Updated on Sep 3 2017 11:15 AM

మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి.

ముంబై: మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా   స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి.  సెన్సెక్స్ 12 పాయింట్ల  లాభంతో  27,377 దగ్గర, నిఫ్టీ 5 పాయింట్ల  లాభంతో 8280 దగ్గర  ట్రేడవుతున్నాయి.  ఆసియా మార్కెట్లలో  మిశ్రమ ఫలితాలు,   దేశీయ మార్కెట్ లో ఇటీవలి లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. గత మూడు సెషన్లలో   సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లకు పైగా లాభపడింది.
ముఖ్యంగా మెటల్, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి.   అయినా ట్రెండ్ పాజిటివ్ గానే ఉందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా  వేస్తున్నారు.

అటు  డాలర్ తో పోలిస్లే రూపాయి బలహీనంగా  ట్రేడవుతోంది.  16  పైసలు  నష్టంతో  వరుసగా నాలుగవ రోజు  కూడా వీక్ గా కొనసాగుతోంది.   మరోవైపు డాలర్ కొనుగోలులో పెరుగుతున్న మద్దతు మూలంగా అటు పసిడి ధర  తగ్గు ముఖం పట్టింది. మరింత దిగి రావచ్చని  ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement