తగ్గించిన ఛార్జీలు రేపటి నుంచే అమలు

Sbi Cut Charges For Non Maintenance Minimum Balance From April 1 - Sakshi

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఇటీవల సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని  సేవింగ్స్‌ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలను 75 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందబోతున్నారు. 

అమల్లోకి రాబోతున్న తగ్గింపు ఛార్జీలివే!

  • అంతకముందు మెట్రో, అర్బన్‌ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గబోతోంది. మెట్రో, అర్బన్‌ ప్రాంతాల సేవింగ్స్‌ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్‌ బ్యాలెన్స్‌ 3వేల రూపాయలు. 
  • అదేవిధంగా సెమీ-అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 12 రూపాయల(+జీఎస్టీ)కు, 10 రూపాయలకు తగ్గించింది. 
  • ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తోంది. దీంతో కస్టమర్లు మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు మినిమమ్‌ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదని తెలిసిందే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top