శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు | Samsung Galaxy A80 Price in India Cut | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

Oct 23 2019 8:48 PM | Updated on Oct 23 2019 8:53 PM

Samsung Galaxy A80 Price in India Cut - Sakshi

సాక్షి, ముంబై: మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ తగ్గింపు ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 8వేల తగ్గింపుతో  గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను రూ.39.990కే విక్రయిస్తోంది.  ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ తరువాత జూలైలో ఇండియాలో విడుదలైంది. అప్పటి దీని ధర  (8జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్)  47,990 రూపాయలు. 

డబుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో 48ఎంపీ భారీ కెపాసిటీ రొటేటింగ్‌ కెమెరా ప్రత్యేక ఫీచర్‌గా వచ్చిన ఏ80 స్మార్ట్‌ఫోన్‌  కెమెరా సెటప్ ను రెండు వైపులా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీల కనుగుణంగా  కెమెరాలో సెల్ఫీ మోడ్‌ను ఎంచుకుంటే  ఇది ఆటోమ్యాటిక్ గా తిరుగుతుంది. ప్రస్తుతం శాంసంగ్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

 శాంసంగ్ గెలాక్సీ ఏ 80  ఫీచర్లు
 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌
 ఆండ్రాయిడ్ 9 పై
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ సాక్‌
48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా +
8 ఎంపీ 123డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా
3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

చదవండి : అద్భుత కెమెరాతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ80

Advertisement
 
Advertisement
Advertisement