మళ్లీ లాభాల్లోకి సెయిల్‌ | SAIL reports Q4 profit of Rs 816 crore | Sakshi
Sakshi News home page

మళ్లీ లాభాల్లోకి సెయిల్‌

Jun 1 2018 12:56 AM | Updated on Jun 1 2018 12:56 AM

SAIL reports Q4 profit of Rs 816 crore - Sakshi

న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం సెయిల్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో  లాభాల బాట పట్టింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.771 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.816 కోట్ల నికర లాభాలు (స్టాండ్‌అలోన్‌) వచ్చాయని సెయిల్‌ తెలిపింది. ఆదాయం బాగా పెరగడంతో ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.14,544 కోట్ల నుంచి రూ.17,265 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,833 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.482 కోట్లకు తగ్గాయని సెయిల్‌ తెలిపింది.  
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెయిల్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.76 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement