
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి భారీగా లాభాలతో ప్రారంభమైంది. ముఖ్యంగా మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌కు పాజిటివ్ అప్‌గ్రేడ్ ఇవ్వడంతో దేశీయ కరెన్సీ ఒక వారం గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి శుక్రవారం 69 పైసలు లాభపడింది. రూ. 64.72వద్ద కొనసాగుతోంది. ఆరంభంలోనే 1.08శాతం వరకు బలపడింది.ఇది మార్చి 14 తరువాత అతిపెద్ద లాభంగా నిలిచింది.
అటు ఈక్విటీ మార్కెట్లు కూడా మూడీస్ రేటింగ్‌ను అందిపుచ్చుకున్నాయి. దాదాపు 13 ఏళ్ల తరువాత అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇండియా సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్ల ఉత్సాహం కొనసాగుతోంది. భారీ కొనుగోళ్లతో కీలక సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.