breaking news
Moodys Boost
-
మూడీస్ రేటింగ్:రూపాయి హై జంప్
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి భారీగా లాభాలతో ప్రారంభమైంది. ముఖ్యంగా మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌కు పాజిటివ్ అప్‌గ్రేడ్ ఇవ్వడంతో దేశీయ కరెన్సీ ఒక వారం గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి శుక్రవారం 69 పైసలు లాభపడింది. రూ. 64.72వద్ద కొనసాగుతోంది. ఆరంభంలోనే 1.08శాతం వరకు బలపడింది.ఇది మార్చి 14 తరువాత అతిపెద్ద లాభంగా నిలిచింది. అటు ఈక్విటీ మార్కెట్లు కూడా మూడీస్ రేటింగ్‌ను అందిపుచ్చుకున్నాయి. దాదాపు 13 ఏళ్ల తరువాత అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇండియా సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్ల ఉత్సాహం కొనసాగుతోంది. భారీ కొనుగోళ్లతో కీలక సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
వావ్...మార్కెట్లకు మూడీస్ బూస్ట్
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంస్థ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్ ఆర్థిక వ్యవస్థకు బీఏఏ 3 నుంచి బీఏఏ 2కి అప్‌గ్రేడ్‌తో మార్కెట్లు జోష్‌గా స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో 33,498 వద్ద నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో10,334 ట్రేడ్అవుతున్నాయి. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని సెక్టార్లకు లాభాలే. ఇన్ఫీ టాప్ లూజర్‌గా వుండగా, ఎస్బీఐ టాప్ గెయినర్‌గా లాభాలను ఆర్జిస్తోంది. సంస్థాగత సంస్కరణల ద్వారా అభివృద్ధి చెందుతున్నభారత్ ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి వృద్ధి అవకాశాలను మూడీస్ సూచించింది. స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు తన రేటింగ్‌ను సవరించింది. దాదాపు 13 సంవత్సరాల విరామం తరువాత రేటింగ్ అప్‌గ్రేడ్ చేయడంతో మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. మరోవైపు మూడీస్ అప్‌గ్రేడ్‌పై రాకేష్ ఝన్ ఝన్ వాలా కూడా స్పందించారు. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. -
మోదీ ప్రభుత్వానికి మూడీస్ బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ గురువారం పెంచింది. ఇప్పటివరకూ ‘స్థిరం’ (స్టేబుల్)గా ఉన్న ఈ రేటింగ్‌ను ‘సానుకూలం’(పాజిటివ్) స్థాయికి పెంచింది. దేశంలోకి పెట్టుబడుల ప్రవాహానికి సంబంధించి మూడీస్ అవుట్‌లుక్ పెంపు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద ఊరటను ఇచ్చే అంశం. త్వరలో సార్వభౌమ రేటింగ్ కూడా... రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ప్రస్తుత ‘బీబీఏ3’ స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందని కూడా మూడీస్ తెలిపింది. ‘బీఏఏ3’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్‌ను సూచిస్తుంది. ‘జంక్’ స్టేటస్‌కు ఇది ఒక అంచె మాత్రమే ఎక్కువ. తాజా అప్‌గ్రేడ్ కారణాలను మూడీస్ వివరించింది. దీని ప్రకారం గడచిన దశాబ్ద కాలంలో ఇతర పలు దేశాలతో పోల్చితే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపింది.