
మోదీ ప్రభుత్వానికి మూడీస్ బూస్ట్
భారత్ క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ గురువారం పెంచింది.
న్యూఢిల్లీ: భారత్ క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ గురువారం పెంచింది. ఇప్పటివరకూ ‘స్థిరం’ (స్టేబుల్)గా ఉన్న ఈ రేటింగ్‌ను ‘సానుకూలం’(పాజిటివ్) స్థాయికి పెంచింది. దేశంలోకి పెట్టుబడుల ప్రవాహానికి సంబంధించి మూడీస్ అవుట్‌లుక్ పెంపు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద ఊరటను ఇచ్చే అంశం.
త్వరలో సార్వభౌమ రేటింగ్ కూడా...
రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ప్రస్తుత ‘బీబీఏ3’ స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందని కూడా మూడీస్ తెలిపింది. ‘బీఏఏ3’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్‌ను సూచిస్తుంది. ‘జంక్’ స్టేటస్‌కు ఇది ఒక అంచె మాత్రమే ఎక్కువ. తాజా అప్‌గ్రేడ్ కారణాలను మూడీస్ వివరించింది. దీని ప్రకారం గడచిన దశాబ్ద కాలంలో ఇతర పలు దేశాలతో పోల్చితే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపింది.