60 దిగువకు రూపాయి | Rupee closes below 60 against dollar | Sakshi
Sakshi News home page

60 దిగువకు రూపాయి

Mar 29 2014 1:35 AM | Updated on Sep 2 2017 5:18 AM

60 దిగువకు రూపాయి

60 దిగువకు రూపాయి

ఎట్టకేలకు దేశీ కరెన్సీ 60 దిగువకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 40 పైసలు బలపడటంతో ఎనిమిది నెలల తరువాత మళ్లీ 59.91కు చేరింది.

ముంబై: ఎట్టకేలకు దేశీ కరెన్సీ 60 దిగువకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 40 పైసలు బలపడటంతో ఎనిమిది నెలల తరువాత మళ్లీ 59.91కు చేరింది. ఇంతక్రితం జూలై 29న మాత్రమే ఈ స్థాయిలో 59.41 వద్ద ముగిసింది. ప్రధానంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో రూపాయికి బలం చేకూరుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటం కూడా సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలి పారు. దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు శుక్రవారంతో కలిపి 5 రోజుల్లో రూ. 7,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయడం ఇందుకు సహకరించిందని వివరించారు.

 ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం ఒక దశలో 63 పైసల వరకూ లాభపడ్డ రూపాయి 59.68 వద్ద గరిష్టాన్ని కూడా తాకింది. చివరికి 0.66%(40 పైసలు) పుంజుకుని 59.91 వద్ద స్థిరపడింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రూపాయిపై ప్రతి కూల ప్రభావంపడే అవకాశమున్నదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ రమేష్ సింగ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement