
ముంబయి: రీడ్ అండ్ టేలర్ కంపెనీ దివాలా ప్రక్రియ మరో మలుపు తిరిగింది. ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) వెంకటేశన్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు. మరోవైపు రీడ్ అండ్ టేలర్‌ను గట్టెక్కించడానికి కాకుండా లిక్విడేషన్ కోసమే రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) ప్రయత్నాలు చేస్తున్నారని రీడ్ అండ్ టేలర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఆసోసియేషన్ వ్యాఖ్యానించింది. వివరాలివీ..
రూ.3,524 కోట్ల మేర మోసాలు...
రీడ్ అండ్ టేలర్ కంపెనీ రూ.4,100 కోట్ల బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ఆ కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని రిసొల్యూషన్ ప్రొఫెషనల్ వెంకటేశన్ శంకర్ నారాయణన్ వెల్లడించారు. అందుకని ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనాన్ని ఆయన కోరారు. కేపీఎమ్‌జీ నిర్వహించిన ప్రత్యేక ఆడిట్‌లో నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని తేలిందని ఆర్‌పీ, వెంకటేశన్ నారాయణన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్‌సీఎల్‌టీకి ఈ నెల
1న ఒక లేఖ రాశారు.
నేడు విచారణ : కంపెనీని టేకోవర్ చేయడానికి తమకు అవకాశమివ్వాలన్న ఉద్యోగుల సంఘం అభ్యర్థనపై నేడు (మంగళవారం) విచారణ జరగనున్నది. కస్లీవాల్ రూ.3,524 కోట్ల అవకతవకల అంశంపై కూడా విచారణ జరగవచ్చు.