రెనాల్ట్‌ క్విడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌ | Renault launches Kwid 02 Anniversary Special Edition in India | Sakshi
Sakshi News home page

రెనాల్ట్‌ క్విడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌

Aug 28 2017 1:16 PM | Updated on Jun 4 2019 6:39 PM

రెనాల్ట్ క్విడ్‌ కొత్త వేరియంట్‌లను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.



రెనాల్ట్  క్విడ్‌ కొత్త వేరియంట్‌లను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.   ప్రత్యేక రెండవ వార్షికోత్సవ  ఎడిషన్‌ను  రెండు వేర్వేరు రంగులలో  కస్టమర్లకు లభించనుంది.  అయితే ఈ కొత్త కాస్మొటిక్‌ అప్‌ గ్రేడ్‌తో  కొత్త ఈ  క్విడ్ 02ను  రూ .15,000 ప్రీమియం వద్ద అందుబాటులో ఉంచింది.  దీని ప్రారంభ ధరను  రూ. 3.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ) గా  నిర్ణయించింది.

కొత్త  కొస్మొటిక్‌ మార్పులు తప్ప మిగతా  అంతా రెగ్యులర్‌ క్విడ్‌  మోడ​ల్‌గానే తీర్చి దిద్దిన ఈ కొత్త కారు 0.8 లీటర్,  1.0 లీటర్ పెట్రోల్‌  ఇంజిన్‌ వేరియంట్లలో లభించనుంది. ఆర్‌ఎక్స్‌ ఎల్‌ 0.8లీటర్‌ వేరియంట్ కోసం రూ. 3.43 లక్షలు గాను,  ఆర్‌ఎక్స్‌ టీ 0.8లీటర్‌ ఇంజీన్‌ వేరియంట్ ధర  రూ .3.76 లక్షలు,  ఆర్‌ఎక్స్‌  1.0 లీటర్‌  వేరియంట్ ధర  రూ .3.64 లక్షలు మరియు  ఆర్‌ఎక్స్‌ టీ 1.0లీ వేరియంట్ కోసం రూ .3.98 లక్షలుగా  ఉండనుంది. కాగా క్విడ్ 02 వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో విక్రయాలపై రెనాల్ట్ ఇంకా నిర్ధారించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement