రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌ లాభంలో 28 శాతం వృద్ధి | Reliance Insurance profit up 28% | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌ లాభంలో 28 శాతం వృద్ధి

Apr 24 2018 12:25 AM | Updated on Apr 24 2018 12:25 AM

Reliance Insurance profit up 28% - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 28 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.165 కోట్లకు పెరిగినట్లు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష ప్రీమియమ్‌ ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.5,069 కోట్లకు చేరిందని కంపెనీ సీఈఓ, ఈడీ రాకేశ్‌ జైన్‌ చెప్పారు. నికర లాభం మెరుగుపడడం, ప్రీమియం పెరుగుతుండడంతో వృద్ధి జోరును కొనసాగిస్తున్నామని చెప్పారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement