ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు | Reliance Industries Friday Announced Better Financial Results | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

Jul 19 2019 8:23 PM | Updated on Jul 19 2019 8:23 PM

Reliance Industries Friday Announced Better Financial Results - Sakshi

మెరుగైన ఫలితాలు ప్రకటించిన ఆర్‌ఐఎల్‌

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 6.8 శాతం వృద్ధితో రూ 10,104 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌ రాబడి రూ 1,72956 కోట్లకు చేరింది. రిలయన్స్‌ జియో ఆపరేషన్స్‌ రెవెన్యూ రూ 5.2 శాతం వృద్ధితో రూ 11,679 కోట్లకు పెరిగింది.

ఇక రిలయన్స్‌ జియో తొలి క్వార్టర్‌లో నికర లాభం 45.6 శాతం వృద్ధితో రూ 891 కోట్లకు పెరిగింది. జియో మొబిలిటీ సేవలు అంచనాలకు మించి వృద్ధి కనబరిచాయని, ఈ క్వార్టర్‌లో జియో నెట్‌వర్క్‌ 11 ఎగ్జాబైట్స్‌ డేటా ట్రాఫిక్‌ను డీల్‌ చేసిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement