ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి! | Reliance Industries asks staff to stop using mobile service of other operators | Sakshi
Sakshi News home page

ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి!

Aug 23 2016 11:43 AM | Updated on Sep 4 2017 10:33 AM

ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి!

ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి!

‘జియో’ ఫోన్లే వాడాలని తమకు ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్(రిల్) సూచింది.

ముంబై: ‘జియో’ ఫోన్లే వాడాలని తమకు ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్(రిల్) సూచింది. ప్రస్తుతం ఇతర సెల్‌ఫోన్ సంస్థల సేవలు వాడుతున్న ఉద్యోగులు 'జియో'కు మారాలని రిల్ కోరింది. ఎయిర్ టెల్, వొడా ఫోన్ లాంటి ఇతర ఆపరేటర్ల సర్వీసులు వాడుతున్న రిలయన్స్ ఉద్యోగులు తమ సొంత కంపెనీ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన హైస్పీడ్ 4జీ జియోకు మారాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు వాణిజ్య సంస్థ అయిన 'రిల్'లో 40 వేల మందిపైగా ఉద్యోగులున్నారు.

'మన కంపెనీ చరిత్రలో మరో మైలురాయిని అందుకోబోతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్ఫోన్ కనెక్షన్లు జియోకు మార్చుకోవాల్సిన అవసరముంద'ని రిలయన్స్ ఉద్యోగులకు రాసిన లేఖలో హెచ్ ఆర్ విభాగం పేర్కొంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్ పీ) ద్వారా ఆపరేటర్ ను మార్చుకోవచ్చని సూచించింది. అంతేకాదు ఎంఎన్ పీకి బంధించిన విధానాన్ని స్టెప్-బై-స్టెప్ ఉద్యోగులకు వివరించింది. కాగా, జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని రిల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 సర్వీస్ ఏరియాల ద్వారా 18వేల పట్టణాలు, 2 లక్షలకుపైగా గ్రామాల్లో జియో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement